Monday, December 23, 2024

మద్యానికి రూ.70 ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచాడు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యానికి 70 రూపాయలు ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో మంగళవారం రాత్రి జరిగింది. కత్తితో దాడి చేసిన అనంతరం నిందితుడు రోడ్డు నవ్వుతూ వికటాట్టహాసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భానునగర్‌కు చెందిన పప్పుల వంశీ, జోగు దుర్గారావు అనే స్నేహితులు ఇద్దరు కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. మంగళవారం రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగడానికి బార్‌కు వచ్చారు.

వంశీ మద్యం తాగడానికి రూ.70 తక్కువగా ఉండడంతో దుర్గారావును అడిగాడు. దుర్గారావు లేవు అని సమాధానం చెప్పడంతో ఇద్దరు మధ్య కాసేపు గొడవ జరిగింది. మద్యం మత్తులో బీరు సీసా తీసుకొని దాడి చేసి సీసా ముక్కతో దుర్గారావు కడుపులో పొడిచాడు. అనంతరం నవ్వుతూ వికటాట్టహాసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన దుర్గారావుకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News