Monday, December 23, 2024

కాంగ్రెస్ లోకి కెకె?… కెసిఆర్ తో భేటీ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో రాజ్యసభ ఎంపి కె కేశవరావు కూతురు, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్ త్వరలో కాంగ్రెస్‌లోకి వెళ్తారని ఊహాగానాలు అందుతున్నాయి. బిఆర్‌ఎస్‌కు కెకె రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై బుధవారం తన కుటుంబ సభ్యులతో కె కేశవ రావు చర్చించనున్నారు. కాసేపల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో కెకె ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని, ఆది నుంచి మర్యాదలు చేసిందని ఎంపి కెకె తెలిపారు. తెలంగాణ కోసం అప్పుడు పార్టీ మారానని వివరణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని, నెరవేరిందని, సొంత పార్టీ వైపు చూస్తే తప్పేంటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News