Sunday, January 5, 2025

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కలిసిన సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో సిజెఐతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సిజెఐ డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిజెఐను సిఎం రేవంత్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News