Tuesday, January 21, 2025

బండి సంజయ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బిజెపి నేత బండి సంజయ్‌తో పాటు మరి కొందరిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సిఐ గోవింద రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం చెంగిచెర్లలో రెండు వర్గాల మధ్య తగాదాలో ఓ వర్గం బాధితులను పరామర్శించడానికి పెద్ద ఎత్తున చెంగిచర్ల చేరుకున్న బిజెపి నేత బండి సంజయ్, బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బిజెపి నాయకుల మధ్య తోపులాట జరుగగా ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.

అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడమే కాకుండా, ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయలవడానికి కారణమయ్యారని, విధి నిర్వహణలో ఉన్న నాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి, ఓ మహిళా కానిస్టేబుల్ తమకు గాయాలు అవ్వడానికి కారణమయ్యారని బండి సంజయ్, ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు బిజెపి నేతలపై పిర్యాదు చేయడంతో సెక్షన్ 332, 253, 354, 149 ల కింద పలువురిఫై కేసు నమోదు చేశామని సిఐ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News