Sunday, November 24, 2024

’కాళేశ్వరం’ కేసు సిబిఐకి అప్పగించాలని కెఎ పాల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని కెఎ పాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇప్పటికే జ్యుడీషియల్ కమిటీ వేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. అయితే దర్యాప్తునకు వనరులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు తను హైకోర్టులో వేసిన పిటిషన్‌పై కెఎ పాల్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సిబిఐతో విచారణ జరిపించాలని కోరినట్లుగా వెల్లడించారు. తన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని, ఏప్రిల్ రెండో తేదీకి కేసును వాయిదా వేసినట్లుగా కేఏ పాల్ వెల్లడించారు.

సిఎం రేవంత్ మాట తప్పారు : కెఎ పాల్
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు గురించి సిబిఐతో విచారణ జరిపిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని కెఎ పాల్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని వెల్లడించారు. రైతులు, ఉద్యోగులు, యువత ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. సిఎం రేవంత్ మాట తప్పారని కెఎ పాల్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీలన్నీ ఒక్కటే అని, తానైతేనే న్యాయం జరుగుతుందని బాబుమోహన్ తనతో అన్నారని కెఎ పాల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News