Monday, December 23, 2024

ఏపిని జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు:చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మాజీ సిఎం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం కదిరి పట్టణలోని ఎస్‌ఆర్‌ఎస్‌టి కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది…చిత్తశుద్ధితో ముస్లిం సోదరులు దీక్షలు చేస్తారన్నారు. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలిచేందుకు అందరి సహకారం కోరుతున్నానని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో టీడీపీ, జనసేన చేరాయని వెల్లడించారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది…చేసేది టీడీపీయే అన్నారు. 1995నుంచి -2004 వరకు ముస్లింలకు అనేక పథకాలను ప్రవేశపెట్టామని, హజ్ హౌస్ ల. నిర్మాణం, హజ్ యాత్రకు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ఉర్దూను రెండో భాషగా ప్రకటించాయని తెలిపారు.

2014లో అధికారంలోకి వచ్చాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణాన్ని చేపట్టామని, 90 శాతం తాము పూర్తి చేస్తే 10 శాతం జగన్ ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిందన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పామని, మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతన విధానాన్ని తీసుకొచ్చామన్నారు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించామని, భవిష్యత్తులోనూ ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామన్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో జగన్ కోలుకోలేని దెబ్బ తీశారని, రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. అందరి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనను ఆశీర్వదించాలని చంద్రబాబు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News