Friday, December 20, 2024

లోయలో పడిన బస్సు: 45 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

జొహెన్నెస్‌బర్గ్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవడంతో 45 మంది సజీవదహనమైన సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఈస్టర్ పండుగ కోసం 46 మంది భక్తులు జియాన్ చర్చికి వెళ్తుండగా కొండపై ఉన్న వంతెన పైనుంచి బస్సు కింద పడింది. బస్సు 165 అడుగుల లోతులో పడిపోవడంతో మంటలు అంటుకోవడంతో 45 మంది సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈస్టర్ పండుగ సందర్భంగా వంతెనపై వీపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుందని స్థానికులు తెలిపారు. దేవుని బిడ్డలు బస్సులో బోట్స్‌వానా నుంచి మోరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News