- Advertisement -
హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉంది. కాంగ్రెస్ లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బిఆర్ఎస్ ను వీడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు చావుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. వరంగల్ పార్లమెంటు నుంచి అభ్యర్థి కోసం కాంగ్రెస్ అధిష్టానం సెర్చింగ్ చేస్తోంది.
- Advertisement -