న్యూయార్క్: క్రిప్టో ఎక్సేంజ్ ఎఫ్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంకుమన్ ఫ్రీడ్‌కు ఆర్థిక మోసాలకు పాల్పడడంతో అతడికి న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ సమయంలో బ్యాంకుమన్ అబద్ధాలు చెప్పడంతో ఆయనపై న్యాయమూర్తి లెవిస్ కప్లన్ మండిపడ్డారు. కస్టమర్ల డబ్బులు హవాలా మార్గంలో వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం నిజం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరుగుతున్న విషయం బ్యాంకుమన్ ముందే తెలుసునని కానీ కస్టమర్లను మోసం చేస్తున్నాననే బాధ ఆయనలో కనిపించలేదని జడ్జి తెలిపారు. 5 ఏళ్ల నుంచి 6.5 ఏళ్లకు శిక్షను పరిమితం చేయాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని, జీవితంలో ఇది మొదటి నేరమని, సంస్థ ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బ్యాంకుమన్ పేర్కొన్నారు. సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని, మెజార్టీ కస్టమర్లకు సొమ్ము ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఆయనకు వంద ఏళ్లు శిక్ష పడాల్సి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. కనీసం 40 ఏళ్లకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసినట్టు న్యాయస్థానం పేర్కొంది. 2019లో ఎఫ్‌టిఎక్స్ పేరుతో క్రిప్టోకరెన్నీ ఎక్సేంజ్‌ను నెలకొల్పారు. ఎఫ్‌టిఎక్స్ , అలమెడా రీసెర్చ్ కంపెనీలు వేర్వేరు అని బ్యాంక్‌మన్ పలుమార్లు చెప్పారు. ఆలమెడా ఆస్తుల్లో క్రిప్టో టోకెన్లు ఉన్నాయి. దీని విలువ సుమారు బిలియన్ డాలర్లు ఉండడంతో సర్క్యూ లేషన్‌లో తక్కువగా కనిపించడంతో పాటు అలమెడా కంపెనీ విలువ లెక్కకు మించి చూపినట్టు తేలింది.
ఎఫ్‌టిఎక్స్‌లో కస్టమర్ల, ఇన్వెస్టర్లు పెట్టిన ఫండ్లను అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా కిందకు తరలించడంతో మోసం బయటపడింది. విలాసవంతమైన జీవితం కోసం ఫండ్లు ఉపయోగించడంతో ఎఫ్‌టిఎక్స్ నుంచి ఇన్వెస్టర్లు తమ షేర్లను విత్ డ్రా చేసుకోవడం మొదలు పెట్టారు. ఎఫ్‌టిఎక్స్ వద్ద సరిపడా నిధులు లేకపోవడంతో చెల్లించలేదు. దీంతో మదపర్లు కోర్టును ఆశ్రయించారు. దాదాపుగా పది బిలియన్ డాలర్ల ఆర్థిక నేరం జరిగినట్టు అమెరికా అధికారులు గుర్తించారు.