Monday, January 20, 2025

గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలనేది నా సంకల్పం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేదల సంక్షేమం కోసం ఎన్‌టిఆర్ టిడిపిని ఏర్పాటు చేశారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పేదలకు రెండో రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారని, సంపద సృష్టించి పేదలకు పంచడమే టిడిపి ధ్యేయమని, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిందే టిడిపి అని, నదులు అనుసంధానం చేయాలని బాధ్యతగా తాము తీసుకున్నామని, పోలవరం ప్రాజెక్టును టిడిపి పాలనలో 72 శాతం పూర్తి చేశామని, గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలనేది తన సంకల్పం అని స్పష్టం చేశారు. బనగానపల్లె ప్రజాగళం ప్రచార యాత్రలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని ముందుకెళ్లామని, అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకొచ్చామని, మూడు రాజధానులు చేశానని సైకో సిఎం జగన్ చెబుతున్నారని, కర్నూలు రాజధాని అయిందా? అని అడుగుతున్నానని, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడటం సరికాదని చంద్రబాబు హితువు పలికారు. మూడు రాజధానులు అని అసలు రాజధానే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాజధాని అనే చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. పేదవాళ్లకు అండగా ఉంటానని, ప్రజల కోసమే పని చేస్తానని వివరణ ఇచ్చారు. పేదరికం లేని రాష్ట్రం తయారు చేసే వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపు రావాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News