Saturday, December 21, 2024

కాంగ్రెస్ లో చేరుతున్న కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిఆర్ఎస్ నేత, మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కాగా కోమటి రెడ్డి బిఆర్ఎస్ గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆమె నిన్ననే వరంగల్ లోక్ సభ కు బిఆర్ఎస్ నుంచి పోటీచేయబోవడాన్ని విరమించుకున్నారు.

కడియం శ్రీహరి ఇటీవల బిఆర్ఎస్ పై వచ్చిన అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయన్నారు. కడియం కుటుంబం పార్టీ మార్పు బిఆర్ఎస్ పార్టీకి  ఓ ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News