ఈశాన్య రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక రైల్వే ఉద్యోగిని పశ్చిమ బెంగాల్ పోలీసులకు చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) బృందం అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9.081 కిలోల ఓపియంను స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్ విలు సుమారు రూ. 90 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ముందుగానే అందిన సమాచారం మేరకు నోఇయా జిల్లాలోని నస్రా హైస్కూలు సమీపంలో గురువారం మాటు వేసిన ఎస్టిఎఫ్ బృందం రైల్వేలో పనిచేస్తున్న ఒక 39 ఏళ్ల గ్రూపు డి ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని రాజు మొండల్‌గా గుర్తించారు. ఒక కొరియర్ కంపెనీ ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఓపియంను తెలప్పిస్తున్నట్లు మొండల్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.
అతడిపై నాడియా జిల్లాలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు. ప్రస్తుతం నయీహటి రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న మొడల్ గత కొన్నేళ్లుగా పార్సెల్ కొరియర్ల ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాల నుంచి తెప్పించకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. డిటిడిసి కొరియర్ కౌంటర్ నుంచి భారీ మొత్తంలో ఓపింయంను అందుకున్న మొండల్ సరకును స్కూటర్‌లో రలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎస్టిఎఫ్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని అధికారులు చెప్పారు. దీని వెనుక పెద్ద స్మగ్లింగ్ రాకెట్ ఉండవచ్చని, దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడవచ్చని అధికారులు తెలిపారు.