Monday, December 23, 2024

న్యూస్‌క్లిక్‌పై 8 వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా అనుకూల ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై నమోదు చేసిన యుఎపిఎ కేసులో 8,000 పేజీలతో కూడిన మొదటి చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసులు శనివరం కోర్టులో దాఖలుచేశారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక సెల్ శనివారం అదనపు సెషన్స్ న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ఎదుట తుది నివేదికను దాఖలు చేశారు. పిపికె న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు పుర్కాయస్థను నిందితులుగా చార్జిషీట్‌లో చూపినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అఖండ్ ప్రతాప్ సింగ్, సూరజ్ రతి తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 16వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. పుర్కాయస్థతోపాటు సంస్థ హెచ్‌ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని 2023 అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అప్రూవర్‌గా మారడానికి అనుమతి కోరుతూ చక్రవర్తి దాఖలు చేసిన దరఖాస్తును ఈ ఏడాది జనవరిలో ప్రస్తుత కోర్టు అనుమతించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News