Monday, November 18, 2024

ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ ఐపిఒ ముగింపు

- Advertisement -
- Advertisement -

86.57 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది
తుది షేర్ల కేటాయింపు రేపు
3న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్

న్యూఢిల్లీ : పబ్లిక్ ఇష్యూ కోసం ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) గురువారం (28న) ముగిసింది. ఆఫర్ చేసిన షేర్ల సంఖ్యకు 86.57 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. సంస్థ ఐపిఒ ద్వారా 4340100 వాటాలను ఆఫర్ చేసింది. అయితే, 375709530 వాటాల కోసం మదుపరులు బిడ్ చేశారు. ఐపిఒపై వారి ఆసక్తి ఎంతలా ఉండో ఇది సూచిస్తోంది. రీటైల్ మదుపరులు ఆసక్తి కనబరిచి 46.97 రెట్టు సబ్‌స్ర్కైబ్ చేశారు.

మ్యూచువల్ ఫండ్లు, బీమా సంస్థలతో సహా భారీ మదుపరులతో కూడిన క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులు (క్యూఐబిలు) 59.59 రెట్లు సబ్‌స్ర్కైబ్ చేశారు. చివరకు సంస్థాగతేతర మదుపరుల (ఎన్‌ఐఐ) కేటగరీలో కూడా అంచనాలకు మించి సబ్‌స్ర్కైబ్ అయింది. అది 214.94 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. తుది వాటాల కేటాయింపు సోమవారం (ఏప్రిల్ 1) నాటికి పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. ఆ తరువాత బుధవారం (3న) బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ రెండింటిలో లిస్ట్ కావాలని ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News