ఈ టెస్టుల నిర్వహణకు
అనుమతి కోరుతూ
హైకోర్టును ఆశ్రయించిన
పోలీసులు ఈ పరీక్షలు
నిర్వహించడం తెలుగు
రాష్ట్రాల్లో ఇదే తొలిసారి
మన తెలంగాణ/ సిటిబ్యూరో: రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నా లు వారు చేస్తుండడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వారి ఎత్తులకు పైఎ త్తులు వేస్తున్నారు. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ను గుర్తించేందుకు వీలుగా క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం కూకట్‌పల్లి కోర్టును పోలీసులు అనుమతి కోరినా దానికి అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టునుఆశ్రయించారు. గత నెల 24వ తేదీన రాడిసన్ హోటల్‌లో డ్ర గ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మంది ని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్ర గ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయింది.
కొంతమంది సెలబ్రిటీలు సమయం తీసుకుని విచారణకు రావడంతో వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు కన్పించలేదు. పరీక్ష చేసినా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియకుండా ఉండేందుకు వా రు ముందుగానే జాగ్రత్త పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితు ల శరీరాల్లో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రా ల్లో ఎవరికీ క్రోమోటోగ్రఫీ పరీక్ష చేయనట్లు తె లుస్తోంది. రక్త నమూనాల ఆధారంగా ఈ ప రీక్షలు నిర్వహిస్తారు. రక్తంలో చాలా సూక్ష్మ స్థాయిలో ఉన్న డ్రగ్‌ను కూడా ఈ పరీక్షల్లో గుర్తించవచ్చు. అంతేకాదు ఏ రకమైన డ్రగ్‌ను తీసుకున్నది కూడా ఇందులో తెలుస్తుంది.
ఈ పరీక్ష ఫలితాలు చాలా కచ్చితత్వంతో ఉం టా యి.గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బిజెపి నాయకుడి కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు, మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.