యాదాద్రి: జనగామ జిల్లాకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ బయలుదేరారు. జనగామ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తుర్కపల్లిలో బిఆర్‌ఎస్ నేతలు మాజీ ఎంఎల్‌ఎలు గొంగిడి సునీ, బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి ఎంపి అభ్యర్థి క్యామ మల్లేష్, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
జనగాం జిల్లా దేవరుప్పల మండలంలోని ధరావత్ తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. 11.30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1.30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎంఎల్‌ఎ క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఎంఎల్‌ఎ క్యాంపు ఆఫీసులోనే భోజనం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంఎల్‌ఎ క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 7 గంటలకు కెసిఆర్ ఎర్రవెల్లికి చేరుకోనున్నారు.
నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖమంత్రి కేసీఆర్. నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండాకు చేరుకోనున్నారు. pic.twitter.com/44ZVJWeEHH
— BRS Party (@BRSparty) March 31, 2024