Friday, November 22, 2024

అడకత్తెరలో సుమలత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మాండ్యా పార్లమెంటు సీటుపై ఉత్కంఠ నెలకొంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత బరిలో దిగారు. సుమలతకు బిజెపి మద్దతు ఇవ్వడంతో అప్పటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో బిజెపి-జెడియు కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో జెడియు నేత కుమారా స్వామి మాండ్యా నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో మాండ్యా నుంచి తాను మళ్లీ పోటీ చేస్తానని సమాచారం ఇవ్వడంతో పాటు బిజెపి మద్దతు ఇవ్వాలని సుమలత విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలోని బిజెపి అగ్రనేతలతో ఆమె సమావేశమయ్యారు. తనకు మాండ్యా లోక్ సభ సీటు ఇవ్వాలని వారిని ప్రాదేయపడ్డారు. మార్చి 30న బిజెపి కర్నాటక చీఫ్ విజయేంద్రతో సుమలత సమావేశమయ్యారు. మాండ్యా నుంచి కుమారా స్వామి పోటీ చేస్తుండడంతో మద్దతు ఇవ్వాలని ఆమెను విజయేంద్ర కోరారు. సుమలత జెడియుకు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన మద్దతుదారులు, అభిమానులతో సమావేశమైన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామనని వివరణ ఇచ్చారు. మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా? మద్దతివ్వాలా? అనే కోణంలో ఆమె ఆలోచన చేయడంతో పాటు ఏప్రిల్ 3న వెల్లడిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News