Sunday, December 22, 2024

దానిపైనే తొలి సంతకం చేస్తా: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీపైనే చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తిలో ఆయన  మాట్లాడుతూ ఎన్డీయేను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 11సార్లు డిఎస్సీ జరిగిందని గుర్తుచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నది తన ఆలోచన అని చెప్పారు. జగన్ ఆలోచనలు స్వార్ధం కోసమని, తన ఆలోచనలు జనం కోసమని అన్నారు. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ మార్చిన ముఖ్యమంత్రి… మంత్రి పెద్దిరెడ్డిని మాత్రం ఎందుకు మార్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News