Sunday, January 19, 2025

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివి: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివని.. రుచి చూసినా చచ్చిపోతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. ప్రజాస్వామ్య పాలన కావాలో?.. నియంతృత్వ పాలన కావాలో? మీరే తేల్చుకోవాలన్నారు. నియంతృత్వానికి మద్దతిచ్చే వారిని దేశం నుంచి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 ఎంపీ సీట్లు గెలువడం అసాధ్యమని రాహుల్ చెప్పారు. ఇప్పటికే మా జట్టులోని ఇదరిని అరెస్టు చేశారన్నారు. ఇవిఎంలు మ్యానేజ్ చేయకుండా, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడకుండా.. ఎన్డియే 200 సీట్లు కూడా గెలవలేదని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News