Sunday, January 19, 2025

ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అలహాబాద్: గుజరాత్ లోని ద్వారకలో ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం విషాదకరం. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభించిందని ప్రాథమికంగా గుర్తించారు.

గాఢనిద్రలో ఉన్నసమయంలో మంటలు చెలరేగడంతో పొగ కమ్ముకుని గదిలో ఉన్నవారు బయటకు రాలేక మంటలకు బలయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్‌లు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా ఇద్దరు భార్యాభర్తలు, వారి చిన్నారి ఎనిమిది నెలల కుమార్తె, మరో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. అదే అపార్ట్‌మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న ఓ మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడ గలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News