కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌సిల మీటింగ్‌ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే రిపీట్ అయ్యింది. కెసిఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఇలా కెసిఆర్ ప్రసంగం మొదలయ్యిందో లేదో కరెంటు పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో ఇట్ల కరెంటు పోతా వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కెసిఆర్ అన్న మాట వినగానే సభ నవ్వులతో నిండిపోయింది. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని కెసిఆర్ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.