Sunday, December 22, 2024

తండ్రి ముందే యువతిని గొంతుకోసి చంపిన సోదరుడు… మరో అన్న వీడియో తీసి…

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని సోదరుడు గొంతు కోసి హత్య చేస్తుండగా మరో సోదరుడు వీడియో తీయగా, తండ్రి అడ్డుకోకుండా అలానే చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పంజాబ్ ప్రావిన్స్‌లో అబ్దుల్ సత్తార్ తన కూతురు బీబీ, కుమారులు మహ్మద్ ఫైజల్, షెహబాజ్‌లు కలిసి ఉంటున్నారు. బీబీని బెడ్‌పై పడేసి సోదరుడు ఫైజల్ కత్తి తీసుకొని ఆమె గొంతు కోస్తుండగా మరో సోదరుడు షెహబాజ్‌లు వీడియోలు తీశాడు.

తండ్రి అక్కడే ఉన్నప్పటికి వాళ్లకు వద్దని చెప్పలేదు. అనంతరం గొంతును నులిమి హత్య చేశాడు. తండ్రి హత్య ఆపలేదు, కుమారుడికి దాహం వేస్తుందని నీళ్లు తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యువతి ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో పరువు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌లో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2022లో పాకిస్థాన్‌లో దాదాపుగా 316 పరువు హత్య కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News