Friday, December 20, 2024

పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల!.. పోటీ ఎక్కడినుంచంటే?

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లే కనబడుతోంది. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన సిఇసి సమావేశంలో 117 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 17 మంది లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను మంగళవారం వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గంనుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఈ నియోజకవర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రినుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడనుంచి మాజీ ఎంపి పళ్లంరాజు, విశాఖ నుంచి సత్యారెడ్డి, అనకాపల్లినుంచి వేంకటేశ్, రాజంపేటనుంచి నజీర్, హిందూపురంనుంచి షాహిన్, బాపట్లనుంచి జేడీ శీలం పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News