- Advertisement -
ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య రుషా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షను సోమవారం ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. జనవరి 31న ఇస్లామాబాద్ అకౌంటబులిటీ కోర్టు ఆ ఇద్దరికి శిక్షను వేసింది. ఆ తీర్పు ప్రకారం ఇమ్రాన్, ఆయన భార్య రుష్రాలు, పదేళ్లపాటు రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ ఇద్దరికీ 787 మిలియన్ల జరిమానా కూడా విధించారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఈద్ వేడుకల తర్వాత ఉంటుందని ఇస్లామాబాద్ చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫారూక్ తెలిపారు. తోషాఖానా కేసులో తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను అనవసరంగా ఈ ఊబిలోకి లాగుతున్నారని ఇమ్రాన్ ఆరోపించారు.
- Advertisement -