Friday, December 20, 2024

బెంగళూరు లో ఉబర్ ప్రయాణికుడికి చేధు అనుభవం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉబర్ ఆటోలో ప్రయాణించిన ప్రయాణికుడికి ఓ చేధు అనుభవం ఎదురైన ఘటనా బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన నీలేష్ తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అయితే నీలేష్ పనిమీద బయటకు వెళ్లాడానికి ఉబర్ ఆటో బుక్ చేసుకున్నాడు. నీలేష్ కేఆర్ పురంలోని టిన్ ప్యాక్టరీ నుంచి కోరమంగళ వెళ్లాలి.

ఆటో బుక్ చేసుకునే సమయంలో నీలేష్ కి పది కిలోమీటర్ల దూరం, రూ. 207 మాత్రమే చూపించింది. అనంతరం వారు గమ్యస్థానినికి చేరుకుని బిల్లు చూడగా రూ. కోటి పైనే ఉంది. ఇది చూసిన నీలేష్ ఒక్కసారిగా ఫాక్ అయ్యాడు. దీంతో ‘పది కిలోమీటర్ల దూరానికి ఉబర్‌ నాకు రూ.కోటి బిల్లు వేసిందంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవలే నోయిడా వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News