Friday, December 20, 2024

ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, పలువురు పోలీసులు, మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం. అటవీ ప్రాంత్రం మావోయిస్టుల కోసం భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇవాళ ఉదయం మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. ఘటనా స్ధలంలో భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News