ఓ జర్నలిస్టు చిరుత పులితో విరోచితంగా పోరాటం చేసి దాన్ని మట్టి కరిపించాడు. ఈ ఘటనా రాజస్థాన్ దుంగార్పుర్ జిల్లాలోని గడియా భదర్ మెట్వాలా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో కవరేజ్ కోసం జర్నలిస్టు వెళ్లాడు. అదే సమయంలో సమీపంలోని భదర్ అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించింది. చిరుతను చూసిన స్థానికులు దాన్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ పై చిరుత దాడి చేసింది.
జర్నలిస్ట్ భయపడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం చిరుతతో పోరాడి దాన్ని బంధించాడు. వెంటనే స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అంధించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది చిరుతను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు. జర్నలిస్ట్ చిరుతతో ఫైట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
जिंदा पैथर #बघेरे का गला दबा उस पर बैठ गया!!
शायद पहला मामला#डूंगरपुर #राजस्थान से@dsrajpurohit291 pic.twitter.com/BTmzu9ccIx— Doonger Singh (@dsrajpurohit291) March 31, 2024