Friday, December 20, 2024

త్వరలో ఓటిటిలోకి ‘గామి’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వంచర్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ విజయాన్ని, రికార్డు స్థాయి కలెక్షన్లను ఈ సినిమా ఇప్పటికే స్వంతం చేసుకుంది.

ఓటిటిలో ఏప్రిల్ 5న జీ5లో విడుదల కాబోతోందని ప్రచారం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించారు. అభిమానులను మెప్పించారు. విజువల్స్, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయని టాక్. విశ్వక్ సేన్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News