Monday, December 23, 2024

బుధవారం రాశి ఫలాలు(03-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం –  ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.రుణాలు తీరుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం – సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా వుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం – ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్వల్ప ధన లాభ సూచన.

కన్య – కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

తుల – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు.

ధనున్సు – వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది.  పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం. వృధా ఖర్చులు అధికమవుతాయి.

మకరం – సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.  వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వస్తు సేకరణ.

కుంభం – ఇంటా బయట మీదే పై చేయిగ ఉంటుంది. అనుకోని వ్యక్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం –  ముఖ్య కార్యక్రమాలలో ఎదురైన కొన్ని ఆటంకాలు తొలుగుతాయి. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ చింతన కలిగి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News