Friday, December 20, 2024

ఆతిశీకి బీజేపీ పరువునష్టం నోటీస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి ఆతిశీపై బీజేపీ పరువునష్టం నోటీస్ జారీ చేసింది. ప్రజలకు ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్ట్ తప్పదని ఓ బీజేపీ నేత తనను అడిగారని మంత్రి ఆతిశీ అరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో తనతోపాటు మరో ముగ్గురు ఆప్ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఆతిశీ ఆరోపించారు. ఈడీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని బీజేపీ నేత ఒకరు ఆశ్రయించినట్టు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ స్పందించింది.

ఆతిశీని ఎవరు ఎప్పుడు ఎలా ఆశ్రయించారు? ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తగిన సాక్షాధారాలను ఆతిశీ ఇవ్వలేక పోయారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో ఆప్ సంక్షోభంలో కూరుకుపోయిందని, అందుకని నిరాశా నిస్పృహలతో ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయినా తాము విడిచిపెట్టేది లేదని చెప్పారు. తన ఆరోపణలను రుజువు చేసుకునేందుకు ఫోన్‌ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సచ్‌దేవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News