స్వంత పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌పై వేటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నిరుపమ్ ఇటీవల విపక్ష ఇండియా కూటమికి, మిత్రపక్షమైన శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం)కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై విమర్శలు సాగిస్తున్నారు. దీనిపై పార్టీ నుంచి ఆయనను తొలగించడానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపుతున్నారు. దానిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటుంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్టార్ కేంపైనర్ జాబితాల్లో నిరుపమ్ పేరు తొలగించడానికి మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశంలో నిర్ణయించడమైందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ వెల్లడించారు. అశోక్ చవాన్ పార్టీని విడిచి వెళ్లడంపై కూడా నిరుపమ్ వ్యతిరేక వ్యాఖ్య చేశారు. నార్త్ వెస్ట్ ముంబై నుంచి టికెట్ ఆశిస్తున్న నిరుపమ్‌కు కాంగ్రెస్ మొండి చేయి చూపడం కూడా కాంగ్రెస్‌పై ఆయన అసంతృప్తికి కారణమైంది.
జమ్ముకశ్మీర్ మెడికల్ కాలేజీలో ఎదురెదురు కాల్పులు…