- Advertisement -
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -