Sunday, January 19, 2025

తెలుగుదేశంలోకి రఘురామకృష్ణంరాజు?

- Advertisement -
- Advertisement -

ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఈమేరకు అయన భీమవరంనుంచి విజయవాడ బయల్దేరారు.

శుక్రవారం ఉదయం భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నెగ్గాలనుకున్నానని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించానని చెప్పారు. తను ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. తన చేత మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుకుని ఇప్పుడు సీటు లేదు పొమ్మంటున్నారని ఆయన కూటమి పార్టీలపై పరోక్షంగా మండిపడ్డారు. తనకు చంద్రబాబు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని, ఒకవేళ టికెట్ లభిస్తే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News