Friday, December 20, 2024

జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హత్యారాజకీయాలకు స్వస్తి పలికాలంటే జగన్ ను ఓడించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. హంతకులను కాపాడేందుకు జగన్ తన సిఎం పదవిని వాడుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా అమంగపల్లిలో ఆమె శుక్రవారం బస్సు యాత్రను ప్రారంభించి మాట్లాడారు.

వివేకానందరెడ్డిని హత్య చేయించినవారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారని, అందుకే కడప నుంచి తాను పోటీకి దిగానని షర్మిల స్పష్టం చేశారు. హంతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభలకు వెళ్లకూడదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ, మరోవైపు వివేకానందరెడ్డిని హత్య చేయించిన వ్యక్తి ఉన్నారు. ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని ఆమె అన్నారు.

ప్రత్యేక హోదా సాధిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత రాష్ట్రాన్ని బిజేపికి తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు. రాజధాని లేదు.. పోలవరం పూర్తి కాలేదు.. రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదని అన్నారు. వైఎస్ఆర్ ఉండి ఉండే ఈపాటికి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News