- Advertisement -
ఒకప్పటి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గంనుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన హేమమాలిని, మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటనను తన వృత్తిగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఈ డ్రీమ్ గర్ల్, తనకు 122 కోట్ల రూపాయల స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద ఒక మెర్సిడెజ్ బెంజ్, ఆల్కజార్, మారుతి వాహనాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనకు 1.4 కోట్ల రూపాయల అప్పులు ఉండగా, 43 లక్షల నగదు చేతిలో ఉందని హేమమాలిని తెలిపారు.
- Advertisement -