- Advertisement -
సినీనటి , ఇండిపెండెంట్ ఎంపి సుమలత అంబరీష్ శుక్రవారం బిజెపిలో చేరారు. కర్నాటకలో ఎన్‌డిఎ బలోపేతానికి ఈ పరిణామం కీలకం అయింది. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత కీలకమైన మైలురాయి, శుభదినం అని సుమలత తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వ పటిమ ఆయన పాలనదక్షత తనకు స్ఫూర్తిదాయకం అయిందన్నారు. బిజెపిలో చేరడం అర్థవంతంగా ఉంటుందని తాను పార్లమెంట్‌లో ఇతరత్రా ఆయన ప్రసంగాలు విన్నతరువాత నిర్ణయించుకున్నానని, ఇప్పుడు ఇది నిజం అయిందన్నారు. కర్నాటక నేతలు యడ్యూరప్ప , విజయేంద్ర , ఆర్ అశోకాలకు సుమలత ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -