Monday, December 23, 2024

నల్గొండ మంత్రులపై జగదీష్ రెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు సోయి లేకుండా పడుకున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా నుండి నీళ్లు వెళ్తున్నా ఇక్కడి ఇద్దరు మంత్రులకు సోయి లేకుండా ఉందన్నారు. పంటలకు సాగు నీరు లేక, పశువులకు తాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇద్దరు మంత్రులు సోయి నుండి నిద్ర లేచి లిఫ్ట్స్ తెరిచి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ నీటిని ఖమ్మం తరలించడంపై నల్లగొండ రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News