అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక భారతీయ విద్యార్థి మరణించినట్లు, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషాద ఘటనల్లో ఇది తాజాది. ఓహియో క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్య సాయి గద్దె ‘దురదృష్టకర మరణానికి’ తాము‘తీవ్ర విచారానికి’ గురైనట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తెలియజేశారు. విద్యార్థి మరణంపై పోలీసుల దర్యాప్తు సాగుతోందని,
భారత్‌లోని అతని కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ తెలిపింది. ‘ఉమా గద్దె భౌతికకాయాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపడంతో సహా సకల విధ సహాయం అందజేస్తున్నాం’ అని కాన్సులేట్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి యుఎస్‌లో భారతీయ, భారత సంతతి విద్యార్థులు కనీసం ఆరుగురు మరణించారు. యుఎస్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు విపరీతంగా పెరగడం భారత సమాజాన్ని కలవరపరుస్తోంది.