Friday, November 22, 2024

ఎసిబికి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఓ వివాదం విషయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్సై, కానిస్టేబుల్ శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎం. రంజిత్, రైటర్ విక్రమ్ రూ.20,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మాదాపూర్‌లోని సాయినగర్‌కు చెందిన ముడావత్ లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. తన భూమిలో లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణం చేస్తున్నాడని సుధా అనే మహిళ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మణ్ నాయక్‌కు ఎస్సై రంజిత్, రైటర్(కానిస్టేబుల్) విక్రమ్ ఫోన్ చేశారు.

స్టేషన్‌కు వచ్చిన లక్ష్మణ్ నాయక్‌తో కేసు లోక్ అదాలత్‌లో పరిష్కారం కావలంటే రూ.50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు, దానికి బాధితుడు ముడావత్ లక్ష్మణ్ రూ.30,000 ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈ విషయం ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎసిబి అధికారులు పోలీసులపై రెండు రోజులు నిఘా పెట్టారు. బాధితుడు రూ.30,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరికి కెమికల్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఎస్సై ఎం. రంజిత్, కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News