Saturday, December 21, 2024

పాతబస్తీలో గన్‌తో కాల్చుకొని ఆర్ఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్‌ఐ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్(48) టిఎస్‌పిఎస్‌లో ఆర్ఎస్ఐగా సేవలందిస్తున్నాడు. గత కొన్ని రోజుల హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం వేకువజామున గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసుల సమాచారం మేరకు డిసిపి సాయి చైతన్య, చార్మినార్ ఎసిపిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్త ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సదరు ఎఎస్‌ఐ ఆత్మహత్య గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. హుస్సేని హాలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News