Sunday, November 3, 2024

ఉగాది పచ్చడి ఉన్నత జీవనానికి సంకేతం

- Advertisement -
- Advertisement -

సమస్త ప్రజానికం నూతన వస్త్ర ధారణ చేసి, భగవధ్యానం లో భాగంగా నూతన సంవత్సరాది స్తోత్ర పూజ చేస్తారు. దేవుని గదిలో మంటపాన్ని మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో నిర్మించి, అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను ఇష్టదేవతారాధనతో బాటు పూజించి, తదనంతరం సూర్యభగవానుడికి మనస్పూర్తిగా నమస్కారం చేసుకుంటారు. తదనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, రకరకాల పిండి వంటలు తయారు చేసి దేవతామూర్తులకు నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరిస్తారు.

ఇలా ప్రతి సంవత్సరాదికీ పాటించి నిష్టగా పూజ చేస్తారు. మన పూర్వీకులు ఉగాది కార్యక్రమాలలో ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరాదికీ నిర్వహించేవారు. ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని సంవత్సరాది స్తోత్ర పూజలోని భావం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News