Friday, December 20, 2024

ముంబైకి షాక్.. వెంటవెంటనే రోహిత్, సూర్య ఔట్

- Advertisement -
- Advertisement -

వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబైకి షాక్ తగిలింది. వెంటవెంటనే ఓపెనర్ రోహిత్ శర్మ(49), సూర్యకుమార్ యాదవ్(0)లు పెవిలియన్ చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబైకి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి రోహిత్ శుభారంభాన్ని అందించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ అలరించాడు రోహిత్. దీంతో 7 ఓవర్లలో ముంబై 80 పరుగులకు చేరుకుంది.

ఈ క్రమంలో అర్థ శతకానికి ఒక పరుగు దూరంలో ఉన్న రోహిత్ ను ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ కూడా ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ముంబై 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్(28), హార్దిక్ పాండ్యా(9)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News