Monday, December 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ నేతల నిరాహార దీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు ఆతిశీ, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బీజేపీ ఈ తరహా కుట్ర పన్నిందని
మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు.

అందులో భాగం గానే ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి గోపాల్‌రాయ్ పిలుపునిచ్చారు. పంజాబ్ సిఎం ఆప్‌నేత భగవంత్ సింగ్ మాన్ , ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ స్వగ్రామం కత్‌కర్ కలాన్‌లో దీక్ష చేపట్టారు. మరోవైపు దేశవిదేశాల్లో కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా దీక్షలు సాగాయి. బోస్టన్‌లో హార్వర్డ్ స్కేర్ వద్ద, లాస్ ఏంజెల్స్‌లో , వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల, టోరంటో, లండన్, మెల్‌బోర్న్‌లో నిరాహార దీక్షలు చేపట్టినట్టు ఆప్ నేతలు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News