Saturday, April 5, 2025

కశ్మీర్ లోయలో మూడు స్థానాలకు పిడిపి అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కశ్మీర్ లోయలో మూడు లోక్‌సభ స్థానాలకు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.
అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తారు. శ్రీనగర్ నుంచి పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వహీద్ పర్రా, బారాముల్లా నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు మీర్ ఫయజ్ పోటీ చేస్తారని పీడీపి పార్లమెంటరీ బోర్డ్ చీఫ్ సర్తజ్ మద్నీ వెల్లడించారు. జమ్ము రీజియన్ లోని ఉధంపూర్, జమ్ము స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులకు పిడిపి మద్దతు ఇస్తుందని ముఫ్తి, మద్నీ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News