Monday, December 23, 2024

గన్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్సై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఓ ఆర్‌ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలోని కబుతారు ఖానా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నాగర్‌కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్(48) హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబుతారు ఖానా ఔట్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. టిఎస్‌ఎస్‌పిలోని 10వ బెటాలియన్‌లో 1995లో కానిస్టేబుల్‌గా చేరిన బాలేశ్వర్ ఆర్‌ఎస్సైగా పదోన్నతి పొందాడు. ఉదయం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న బాలేశ్వర్ తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. గన్ మిస్‌ఫైర్ కావడం వల్లే కానిస్టేబుల్ మృతిచెందాడని పోలీసులు చెబుతున్నారు. గన్ మిస్ ఫైర్ అయ్యిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News