Sunday, January 5, 2025

కన్య రాశివారికి ఆర్థికంగా కలిసొచ్చే సంవత్సరమిది!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 05 వ్యయం : 05
రాజ : 05 అవమానం : 02

ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1,2 పాదముల యందు పుట్టినవారు “టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కన్యారాశికి చెందినవారు.

కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా అవుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కాని సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి, సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా సత్త్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరియైన సమయం అని చెప్పవచ్చును. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటి కీ ఇంకా ఏదో సాధించాలని, తెలుసుకోవాలని ముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది. విహార యాత్రులు, తీర్ధ యాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగించి ప్రశాంతతను నెలకొల్పుతారు. రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతారు. వాటిని అవలంబిస్తారు. సం ఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను, ఆ ధ్యాత్మిక వేత్తలతో కలిసి పని చేస్తారు.

నూతన వృత్తులు, మద్యం, మాంసం, వ్యా పారాలు చేసే వారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడి ఉండకూడదు. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం. భాగస్వాములు మోసాలు చేసే అవకాశా లు ఉన్నాయి. ముందుగా మేల్కొని తప్పులు జరగకుండా చూసుకోవడం ఉత్తమము. మిల్క్‌డైరీ ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వెంటనే ప్రారింభిస్తారు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. సువర్ణ ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటా రు.

కళా, సాహిత్యరంగంలోని వారికి మంచి గు ర్తింపు. అవార్డులు లభిస్తాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి, అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆదా చే యలేరు. ఏ విధంగా వచ్చినా వచ్చింది వచ్చిన ట్లు నీళ్ళ ప్రాయంగా ఖర్చైపోతుంది. పది రూపాయల సంపాదన ఉంటే 20 రూపాయలు దానధర్మాలకు, కుటుంబ పురోగాభివృద్ధికి ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు ఖర్చవుతుంది. ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం ఉంటే ఏదైనా అసాధ్యం సుసాధ్యం అని మరొకమారు రుజువు అవుతుంది. ఋణ గ్రస్తులకి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దలు, అయినవాళ్ళ సంతోషానికి మీ శక్తికి మించి ఖర్చుపెట్టి, వాళ్ళను చాలా సంతృప్తిపరుస్తారు. ఈ రాశిలో జన్మించిన భార్యాభర్తలు మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం.

మీద్వారా అన్ని సహాయాలను, సంరక్షణను పొందినా ప్రేమ మాత్రం వేరేవాళ్ళ మీద ఉంటుంది. కుటుంబలో పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు. కొంత ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్ధులు ముఖ్యంగా 10వ తరగతి చదివే వారు కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి నెలకుంటుంది. ప్రస్తుత సమాజంలో నెలకున్న దుర అలవాట్లుకు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లల స్వతంత్ర నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యాసంబంధమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్నత విద్యలు అభ్యసించ గలుగుతారు. కుల, మత, వర్గ ప్రాంతీయ విద్వేషాలు మీ మీద ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ప్రభావం చూపుతాయి. మిమ్ములను మీరు నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. లిఖితపూర్వకంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం చెప్పి మీ ప్రయోజనాలను కొంతమంది అధికారులు అడ్డుకుంటారు. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది.

క్రీడాసంబంధమైన విషయాలలో కొంత మానసిక సంతృప్తి కలుగుతుంది. సంతానం క్రీడాసంబంధమైన విషయాల్లో రాణిస్తారు. మీ మానసిక సంతోషానికి కొన్ని విషయాలు కారణం అవుతాయి. ఉద్యోగానికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బాగా ఉపకరిస్తాయి. మీ పిల్లలకు మీ బంధువుల పిల్లలకు చదువులో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పర అవగాహనతో ఒకరినొకరు అర్ధం చేసుకుని, చక్కటి వాతావరణం నెలకొల్పుకోవాలి. లేదంటే శృతిమించి రాగాన పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి, తెగతెంపులు చేసేవారు ఉంటారు. భార్యాభర్తల ఇరువురి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించండి. స్త్రీలవల్ల కొన్ని ప్రయోజ నాలను పొందుతారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం వక్ర ధోరణి పట్ల విరక్తి కలుగుతుంది.

ముఖ్యంగా ఈ సంవత్సరం మీనా రాశిలో కేతు సంచారం. సప్తమంలో రాహు గ్రహ సంచారం, కుంభంలో శని గ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురు గ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్ధేశిస్తున్నాయి.
ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత ెమం మరియు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడంవలన మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు వాటి నిర్వహణ పురోగమనంలో ఉంటాయి, మంచి పేరు వస్తుంది. కొన్ని సందర్భాలలో జీవితం మళ్ళీ ప్రారంభిస్తున్నామా అనిపిస్తుంది. గృహనిర్మాణ సంబంధమైన లోనులు మంజూరు అవుతాయి. హోల్‌సేల్, వ్యాపారాని కన్నా, రిటైల్ మార్కెటింగ్‌లో ఎక్కువ లాభాలు పొందుతారు. సినిమా, టివి రంగంలోని వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం సంస్థ విస్తరించడంకోసం దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. రహస్య చర్చలు పూర్తిచేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News