Sunday, January 5, 2025

మీన రాశివారికి ఆదాయం భేష్!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 11 వ్యయం : 05
రాజ : 02 అవమానం : 04

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టిన వారు “ది,దు,శ్యం,ఝా,దా,దే,దో,చా,చి” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.

మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితా లు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ము ఖ్యంగా జన్మరాశిలో రాహు గ్రహ సంచారం, ద్వితీయ, తృతీయాలలో గురు గ్రహ సంచారం, సప్తమ వ్యయంలో కేతు, శని గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయ డం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీ యొక్క ఆలోచనా విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి.

దాని వలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. నూ తన భాగస్వాముల వ్యాపారంలో ధనం పెట్టుబడిగా పెట్టకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలను బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలో ని కొంత మంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్ళు వృత్తి లో అసంతృప్తి ఏర్పడుతుంది. మీ ప్రయత్నలో పం వలన కావచ్చు, వేరే కారణాలు కావచ్చు. చేసే పనిలో కొంత జాప్యం జరిగే విధంగా గోచరిస్తున్నది. వృధా ప్రయాణాలు అధికమవుతాయి. ఒక్కో సంధర్భంలో వృధా ప్రయాస అవుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది. ఇతరుల జ్యోక్యం అనవసరం. దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు.

అయి నా కూడా తగిన జాగ్రత్తలు అవసరం. షుగర్, జీర్ణవ్యవస్థ, మోకాళ్ళు నొప్పులు, ఇ.ఎన్.టి., న రాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అన్నదమ్ములు అక్క చెల్లెలు మధ్య సంబంధబాంధవ్యాలు అనుకూలిస్తాయి. అయిన వారికి కొంత కాలం దూరంగా ఉంటారు. పి.హెచ్.డి. చేసే వా రికి అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. కాని ఆదాయం కం టికి కనిపించదు. ఎంతున్నా లేదనే భావన ఉం టుంది. సామాన్యంగా ఎవర్నీ అతిగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయరంగంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకొని సమాజంలో మీ స్థాయిని పెంచుకోగలుగుతారు. కుటుంబ పరం గా తీర్థయాత్రలు చేస్తారు.

దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆ ధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మెడిటేషన్ యోగా వంటి విషయాలలో ఆసక్తి ఉన్నా వాటిని పెద్దగా పా టించరు. మీరు చేసే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, దైవకార్యక్రమాలు, అన్నదా నం, విద్యాదానం ఇలాంటివన్ని కూడా మీకు, మీ కుటుంబానికి లాభం చేకూరుస్తాయి. నూత న వాహనం కొనుగోలు చేస్తారు. మీకున్న ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతారు. సహోదరసహోదరీ వర్గానికి అండగా వుంటారు. అన్ని మీరై వా ళ్ళకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఈ సంవత్స రం పరీక్షాకాలం అని చెప్పవచ్చును. వివాదాల కు దూరంగా ఉండటం మంచిది. అనుకోని సం ఘటనలు ఎదురైనా ధృఢ సంకల్పంతో ముందు కు సాగితే విజయాలు అందుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుంటూ వాటికి అనుగుణంగా నడుచుకోవడం వలన సత్పలితాలను పొందుతారు. ఈ సంవత్సరం ఈ రాశివా రు సుబ్రహ్మణ్య పాశుపత ెమం చేయించుకోవా లి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వా రికి పూజాధి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా కృత్తి కా నక్షత్రం నాడు స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తా యి. అను నిత్యం హనుమాన్ చాలీసా, మన్యు సూక్తం పఠిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది. వివాహ సంబంధమైన విషయాలలో అనుబంధాలకు, బాధ్యతలకు అతీతంగా వ్యవహరించండి. సున్నితమైన విషయాలలో కొన్ని తప్పిదాలు జరుగు తాయి. అందుకు మీ ప్రమేయం ఉండదు. అతికష్టంమీద ముఖ్యమైన తప్పిదాలలో మీ తప్పు లేదని మాత్రం ఋ జువు అవుతుంది. విడిపోవాలని నిర్ణయించుకు న్న భార్యా భర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది. కొంత మంది విషయంలో పెళ్ళి చేదు అనుభవంగా మిగులుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం ఓ గాడిలో ప డుతుంది. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకా లు మనస్సును బాధిస్తాయి.

కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు అభివృద్దికి అడ్డంకిగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అ వుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్‌కం ట్యాక్స్‌లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం, లభిస్తుంది. విలువైన పత్రాలు, డాక్యుమెం ట్స్ చోరీకి గురి అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. విలాసవంతమైన జీవితానికి దూ రంగా ఉండాలని భావిస్తారు అయితే అది ఆచరణలో సాధ్యం కాదు. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. చేసిన పొరపాట్లను మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు నమ్మవ ద్దు, ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అంటే మీకంటితో చూసి నిజాలు నిర్ధారించుకోండి, దీనివల్ల మేలు జరుగు తుంది. భూమి, వాహన సంబంధమైన విషయాలు, కొనుగోళ్ళు అమ్మకాల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News