Friday, December 20, 2024

టాప్ 4 కంపెనీల విలువ రూ.1.71 లక్షల కోట్లు జంప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 కంపెనీల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,71,309 కోట్లు పెరిగింది. అయితే టాప్ 10లో 6 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.78,127 కోట్లు తగ్గింది. వీటిలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.38,462 కోట్లు పడిపోయి మొత్తం విలువ రూ.19.76 లక్షల కోట్లకు చేరుకుంది.

ఈ కాలంలో రిలయన్స్‌తో పాటు ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ తగ్గింది. కాగా గత వారం మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.76,880.74 కోట్లు పెరిగి మొత్తం విలువ రూ.11.77 లక్షల కోట్లకు చేరింది. ఇది కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి ) మార్కెట్ విలువ రూ.49,208.48 కోట్లు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్ ) రూ. 34,733.64 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రూ.10,486.42 కోట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News