Friday, December 20, 2024

బాచుపల్లిలో యువకుడిని చంపి… సోషల్ మీడియాలో డ్యాన్స్ లు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో బాచుపల్లిలో దారుణం జరిగింది. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న తేజస్ అలియాస్ సిద్దును ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం సిద్దును చంపేసి ఇన్ స్టాగ్రామ్ లో హత్య చేశామంటూ నిందితులు పోస్టు చేశారు. సిద్దుని హత్య చేసినట్లుగా చూపెడుతూ డాన్సులు చేస్తూ నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు సిద్దును వెంటాడి వేటాడి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు వద్ద గత సంవత్సరం తరుణ్ ను సిద్దు హత్య చేశాడు. దసరా పండగ రోజున ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో సిద్దు ఎ3గా ఉన్నాడు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News