Monday, January 20, 2025

సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని టిజి 09 ఆర్‌ఆర్ 0009 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ వాహనం టైరు ఒక్కసారిగా పేలింది. సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సిఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. దీంతో సిఎం, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చు కున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్‌కు బయలుదేరి వెళ్లారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News